బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ ఆంటోనీ (Vijay Anthony). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇపుడు విజయ్ ఆంటోనీ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ మంచి పాపులారిటీ తెచ్చుకుంది హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). అయితే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు.
ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర (ravanasura)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ విజయ్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 80లలో పీరియాడిక్ డ్రామా (80s period drama) బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ ప్రాజెక్టు షూటింగ్ మే చివరి వారం నుంచి మొదలుకానున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
విజయ్ ఆంటోనీ సినిమాలంటే బాక్సాపీస్ వద్ద మంచి క్రేజ్ ఉంటుంది. మరి పీరియాడిక్ స్టోరీ కావడంతో సిల్వర్ స్క్రీన్‌పై ఈసారి ఎలా కనిపించబోతున్నాడోనంటూ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.