Bhariava Dweepam | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ క్లాసిక్ చిత్రం ‘భైరవద్వీపం’. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలై గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా క్లాప్స్ ఇన్ఫోటెన్‌మెంట్ సంస్థ పి.దేవ్‌తో కలిసి చంద్రశేఖర్ కుమారస్వామి ఈ క్లాసిక్ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకుల కోసం సరికొత్త సొబగులు అద్ది 4కె క్వాలిటీతో ఆగస్టు 5న రీ రిలీజ్ చేస్తున్నారు.
రావికొండల రావు రచించిన ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీకి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఈ పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. రోజా, కైకాల సత్యనారాయణ, విజయ్‌కుమార్, రంభ, విజయ రంగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కబీర్‌లాల్.