Jailer 2 | ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. చేసిన సినిమా ఎలాంటి మార్క్ క్రియేట్ చేసిందన్నదే ముఖ్యం.. ఈ డైలాగ్‌ను అప్లై చేసే కోలీవుడ్ డైరెక్టర్లలో ఒకడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) . కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తక్కువ టైంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో జైలర్ తెరకెక్కించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా తమ అభిమాన దర్శకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్లు, అభిమానులు. ఓ వైపు బర్త్ డే విషెస్ చెబుతూనే మరోవైపు జైలర్ 2 (Jailer 2) కోసం వెయిటింగ్ ఇక్కడ.. కొత్త అప్డేట్ ఎప్పుడు అంటూ అడుగుతున్నారు. మరి నెల్సన్ దిలీప్ కుమార్ రానున్న రోజుల్లో జైలర్ 2 సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. రజినీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
గతేడాది ఆగస్టు 09న విడుదలైన ఈ చిత్రం సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తలైవా ఫీవర్ ఎలా ఉందో మరోసారి చూపించింది జైలర్.
వెయిటింగ్ ఇక్కడ..
Happy Birthday #Nelson ..🤝 His Unique style of Black comedy Actioners & its characters are always likeable..💥
Thanks for #Jailer & Waiting for #Jailer2 (Hukum)..🤝🔥 pic.twitter.com/H9i11bM86i
— Laxmi Kanth (@iammoviebuff007) June 21, 2024