Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతుంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకున్న థియేటర్ల కొరత ఉండడంతో మూవీని వాయిదా వేసుకున్నారు. అయితే రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న రానున్నట్లు చిత్రసీమలో టాక్ నడుస్తోంది.
అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. మేకర్స్ ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల తేదీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 05న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్లో ఆధార్ కార్డు నోట్లో పెట్టుకుని రేషన్ సరుకుల కోసం పరిగెడుతున్నట్లు విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు.
Arriving
April 05 2024. #FamilyStar pic.twitter.com/pX4UOD7pL6— Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2024
‘ఫ్యామిలీ స్టార్’లో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీతం: గోపీ సుందర్.