‘స్కంద’లో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి
“ఎందరో గొప్ప కవులకూ, కళాకారులకూ జన్మనిచ్చిన స్థలం ఈ కరీంనగర్. పవిత్ర గోదావరి పారే పుణ్యతీర్థం ఈ కరీంనగర్. ఇంతటి పవిత్ర స్థానంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. సినిమా బాగా తీశాను. మంచి సినిమా తీసి మీ ముందుకొచ్చాను.
“ఎందరో గొప్ప కవులకూ, కళాకారులకూ జన్మనిచ్చిన స్థలం ఈ కరీంనగర్. పవిత్ర గోదావరి పారే పుణ్యతీర్థం ఈ కరీంనగర్. ఇంతటి పవిత్ర స్థానంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. సినిమా బాగా తీశాను. మంచి సినిమా తీసి మీ ముందుకొచ్చాను. అందుకే టెన్షన్ లేదు. మీరు ఆదరిస్తారని నా నమ్మకం” అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాస్ చిట్టూరి, పవన్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో రామ్ మాట్లాడుతూ -“ ‘స్కంద’ మాస్ సినిమా మాత్రమే కాదు. చక్కని కుటుంబకథాచిత్రం కూడా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బోయపాటి గత సినిమాల్లా మంచి మెసేజ్ కూడా ఇందులో ఉంటుంది” అని చెప్పారు.
“బోయపాటి దర్శకత్వంలో సరైనోడు, అఖండ సినిమాల్లో నటించాను. ఇది ఆయనతో నేను చేసిన మూడో సినిమా. కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్.. నో డౌట్. బోయపాటితో ఇది నా హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ ఎనర్జీని చూసినప్పుడు షాకయ్యాను. ఇంతకంటే చేయటానికేముంది? అనిపించింది. ఈ సినిమాలో అంతకు మించిన ఎనర్జీని చూపించాడు రామ్. ఈ సినిమా భారీ విజయం పక్కా.” అని శ్రీకాంత్ నమ్మకంగా చెప్పారు. ఇంకా సయీ మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్, దగ్గుబాటి రాజా, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ డేటాకే, శ్రవణ్, రచ్చ రవి, చిట్టి, నెక్కంటి శ్రీధర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

