Dhoomam Movie First Look | మలయాళ ఇండస్ట్రీలో ఫాహద్ ఫాజిల్‌కు తిరుగులేని స్టార్ట్డమ్ ఉంది. కెరీర్ బిగెనింగ్ నుంచి వినూత్న సినిమాలు చేస్తూ ఆడియోన్స్‌లో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఫాహద్ ఓటీటీలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఆయన సినిమాలను మనవాళ్లు సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ తెగ చూసేవారు. అదే క్రేజ్ ‘పుష్ప’లో చాన్స్ వచ్చేలా చేసింది. ఇక పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్‌గా చివరి పదిహేను నిమిషాలను ప్రేక్షకులను ఎంత భయపెట్టాలో అంత భయపెట్టేశాడు. సెకండ్ పార్ట్‌లో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుందోనని అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇక ఇదిలా ఉంటే ఫాహద్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను సెట్స్ మీదుంచాడు. అందులో ‘ధూమమ్’ ‘ఒకటి’. ‘కేజీఎఫ్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను నిర్మించిన ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది. పోస్టర్లో ఫాహద్ ఫాహద్ ప్లాస్టర్ వేసుకుని ఉన్నాడు. నిప్పు లేకుండా పొగ లేదు అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ధూమపానాన్ని బేస్ చేసుకుని ఈ కథ తెరకెక్కినట్లు పోస్టర్‌తోనే స్పష్టమవుతుంది. ఈ సినిమాకు ‘యూ టర్న్’ ఫేం పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకులు ముందుకు రానుంది.
There is no smoke without fire, here is the first spark.
Presenting #Dhoomam First Look 🔥#DhoomamFirstLook#FahadhFaasil @pawanfilms #VijayKiragandur @aparnabala2 @hombalefilms @HombaleGroup @Poornac38242912 #PreethaJayaraman @AneesNadodi @roshanmathew22 #VineethRadhakrishnan… pic.twitter.com/t42D2Dj2c4
— Hombale Films (@hombalefilms) April 17, 2023