Fahadh Faasil | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్. ఈ మాలీవుడ్ స్టార్ యాక్టర్ సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకెళ్తుంటాడని తెలిసిందే. పుష్ప ప్రాంఛైజీలో షెకావత్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు ఫహద్ ఫాసిల్. కాగా ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.
ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న తెలుగు డెబ్యూ ఫిల్మ్ Don’t Trouble the Trouble మొదలైంది. మార్చి 2024లో ఈ సినిమాను ప్రకటించారు. బాహుబలి లాంటి మాగ్నమ్ ఓపస్‌ను తెరకెక్కించి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఈ మూవీతో శశాంక్ యేలేటి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫాంటసీ సినిమాగా ఫన్, థ్రిల్లింగ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీ షూటింగ్ శనివారం మొదలైంది. సినిమా ప్రకటించిన ఏడాదిన్నర తర్వాత ఫహద్ ఫాసిల్ సెట్స్‌లో జాయిన్ అయి అభిమానులతోపాటు తెలుగు మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఆర్కా మీడియా వర్క్స్, ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ Showing Business సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
SS Rajamouli Presents #FahadhFaasil Starrer #DontTroubleTheTrouble – A Fun & emotional Fantasy entertainer. Shoot Begins..🔥
Directed by #ShashankYeleti 🎬
Produced by ArkaMediaworks & Showing Business 💵 pic.twitter.com/tblXeuWpAK— Mehtab Rai (@cine_m26) October 19, 2025