F3 Trailer | ఒక సినిమా మంచి విజయం సాధిస్తే దానికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ ఆరాటపడుతుంటారు. ఇక సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అయితే అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు విజయాలు సాధించినవి చాలా తక్కువే అని చెప్పాలి. ఈ క్రమంలో ఒరిజినల్ కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్-3’ బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్తో ఎఫ్3 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఓ బిగ్ అప్డేట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎఫ్3 ట్రైలర్ డేట్‌ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మే 9న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
The FUN BOMB explodes BIG with a Blasting Update 💥
Get ready to tickle your fun bones with a FUN-tastic #F3Trailer 🥳
Releasing on MAY 9th 🙌#F3Movie@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/2O99fJBWkw— Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2022