F3 Movie | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు చాలా వరకు పరాజయాలనే సాధించాయి. ఈ క్రమంలో మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్-3’ బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్తో ఎఫ్3 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరిన్, సోనాల్ చౌహన్లు గోడచాటు నుంచి చూస్తున్నట్లు ఉంది. ఈ చిత్ర ట్రైలర్ సొమవారం ఉదయం 10.08నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఇదివరకే తెలిపారు.
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. ఇక ఈ చిత్రం గతంలోనే విడుదల కావాల్సంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
Prepare for the Bombastic FUN Explosion !!! 💥💣#F3Trailer Releasing Tomorrow, May 9th @ 10:08AM ⏰
BIGGEST FUN FRANCHISE #F3Movie 🥳@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/4lCKl9Th6Q
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022