Nithiin32 Movie | నితిన్ హిట్టు చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట భీష్మతో బంపర్ హిట్ అందుకున్న నితిన్ మళ్లీ ఇప్పటివరకు హిట్టు వాసనే చూడలేదు. ఎంతో కష్టపడి చేసిన మాచర్ల సైతం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారంలోపే బిస్తరు కట్టేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటివరకైతే ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. పైగా వక్కంతం వంశీ లాస్ట్ సినిమా నా పేరు సూర్య ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. కాకపోతే శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాక జనాలకు ఈ సినిమా ఒకటుందని తెలిసింది.
కుదిరితే వినాయక చవితికి ఈ సినిమాను దింపాలని మేకర్స్ తెగ ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చేసిందని టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎగస్ట్రా అనే టైటిల్‌ను ఈ ప్రాజెక్ట్‌కు ఫిక్స్ చేశారట. ఆర్టీనరీ మ్యాన్ అనేది ఉపశీర్షికట. మొత్తంగా చూసుకుంటే ఎక్స్ట్రార్డినరీ మ్యన్ వచ్చేలా టైటిల్‌ను ప్లాన్ చేశారట. ఇలా డిఫరెంట్ టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.