Excellencia AI | విద్యార్థుల అభ్యసనానికి కృత్రిమ మేధ తోడు.. హైదరాబాద్లో ‘ఎక్సలెన్షియా.ఏఐ’ యాప్ ఆవిష్కరణ!
Hyderabad | విద్యారంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించిన ‘ఎక్సలెన్షియా.ఏఐ (Excellencia.AI)’ యాప్ను హైదరాబాద్లోని టీ-హబ్లో ఘనంగా ఆవిష్కరించారు
విద్యారంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించిన ‘ఎక్సలెన్షియా.ఏఐ (Excellencia.AI)’ యాప్ను హైదరాబాద్లోని టీ-హబ్లో ఘనంగా ఆవిష్కరించారు. ఏఐ ఆధారిత అభ్యసన విధానాన్ని ప్రవేశపెట్టిన హైదరాబాద్లోని తొలి విద్యాసంస్థగా ఎక్సలెన్షియా నిలిచినట్లు ది ఎక్సలెన్షియా గ్రూప్, ది క్వాంటియమ్ స్కూల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ వెంకట్ మురికి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు డాక్టర్ జె.ఏ. చౌదరి యాప్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జె.ఏ. చౌదరి మాట్లాడుతూ, విద్యార్థులను కేవలం ఐఐటీలకు పంపడమే విద్యా వ్యవస్థ లక్ష్యం కాకూడదని, వారిలో నిజమైన జ్ఞానం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. చైనా వంటి దేశాల్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలను ఆటల రూపంలో ఆసక్తికరంగా బోధిస్తున్నారని, అలాంటి విధానాలు విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంచుతాయని పేర్కొన్నారు. ఏఐ రాకతో ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. నగరాలకే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా సాంకేతికత ద్వారా నాణ్యమైన విద్య అందేలా విద్యావేత్తలు, పరిశోధకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ది ఎక్సలెన్షియా గ్రూప్, ది క్వాంటియమ్ స్కూల్ వ్యవస్థాపకులు వెంకట్ మురికి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి అభ్యసన వేగం, అవగాహన శక్తి భిన్నంగా ఉంటాయని, వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధించేందుకే ‘ఎక్సలెన్షియా.ఏఐ’ యాప్ను రూపొందించామని తెలిపారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, బట్టీ విధానానికి స్వస్తి పలికేలా ఈ యాప్ పనిచేస్తుందన్నారు. ఇందులో గత 4, 8, 12 వారాల పరీక్షలు, హోంవర్క్ ఫలితాలను ఏఐ విశ్లేషించి, విద్యార్థులు వెనుకబడిన అంశాలపై ప్రత్యేక ప్రశ్నాపత్రాలను రూపొందిస్తుంది. భౌతిక, రసాయన శాస్త్రాల్లోని క్లిష్టమైన సూత్రాలు, రసాయన చర్యలను త్రీడీ సిమ్యులేషన్లు, ఇంటరాక్టివ్ పుస్తకాల ద్వారా కళ్లముందే చూసి నేర్చుకునే వీలుంది. అంతేకాకుండా విద్యార్థులు ఏ సమయంలోనైనా తమ సందేహాలను ఏఐని అడిగి నివృత్తి చేసుకోవడంతో పాటు, పక్షపాత రహిత ఏఐ మూల్యాంకనం ద్వారా సమాధానాల్లోని లోపాలను తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.excellencia.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

