యువతరం యుఫోరియా
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ట్రెండీ మూవీ ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మాత. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాశ్, నవీనారెడ్డి, లికిత్ నాయుడు ఇందులో ముఖ్య పాత్రధారులు. ప్రస్తుతం సినిమా నిర్మాణదశలో ఉంది.
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ట్రెండీ మూవీ ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మాత. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాశ్, నవీనారెడ్డి, లికిత్ నాయుడు ఇందులో ముఖ్య పాత్రధారులు. ప్రస్తుతం సినిమా నిర్మాణదశలో ఉంది. మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఈ సినిమాలోని ‘ఫ్లై హై..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ గీతాన్ని కాలభైరవ స్వరపరిచి, పృథ్వీచంద్ర, గాయత్రి నటరాజన్‌లతో కలిసి ఆలపించారు. యువత మత్తులో మునగడం, నైట్ అవుట్స్, ఫ్రెండ్స్‌తో పార్టీలు ఇలాంటి విపరీత పోకడలను ఈ పాటలో చూపించారు. యూత్‌కి ఇన్స్టంట్ కిక్ ఇచ్చేలా పాటను చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. ‘ఆడియెన్స్ చూపించే ఎనర్జీయే ‘యుఫోరియా’.
ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఇందులో కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది. నేను చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నా.’ అని దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, కృష్ణహరి, కెమెరా: ప్రవీణ్ కె.పోతన్, సమర్పణ: రాగిణి గుణ, నిర్మాణం: గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

