ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli)డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి ఎత్తర జెండా వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అలియాభట్, రాంచరణ్, ఎన్టీఆర్ పై వచ్చే ఈ పాట కలర్ఫుల్గా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీం రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. హాలీవుడ్ బ్యూటీ ఒలివియో మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది…అజయ్ దేవ్గన్, సముద్రఖని, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను యంయం కీరవాణి కంపోజ్ చేశారు. విశాల్ మిశ్రా, పృథ్విచంద్ర, యంయం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్ పాడారు.