బేబీ సాయితేజస్విని ప్రధాన పాత్రలో నటించిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎర్రచీర’. సుమన్‌బాబు దర్శకత్వం వహించడంతోపాటు ఇందులో కీలక పాత్రను కూడా పోషించారు. శివరాత్రి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. ఈ నెల 25న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ైక్లెమాక్స్ అద్భుతంగా ఉంటుందని, సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇదని నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో 45 నిమిషాల గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, మాటలు: గోపి విమల పుత్ర.