NBK108 Title| ‘అఖండ’ సక్సెస్‌తో నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి కే. రాఘవేంద్ర రావు, దిల్‌రాజు, అల్లు అరవింద్, గెస్ట్లుగా వచ్చారు. ఈ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య 45ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్య కూతురుగా పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్టు సాధించిన అనిల్.. మొదటి సారిగా మాస్ యాక్షన్ సినిమా తీస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్యతో. మరి ఈ కాంబో బాక్సాఫీస్‌పై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
#NBK108Begins pic.twitter.com/m5fY3kN52d
— Shine Screens (@Shine_Screens) December 8, 2022