Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ప్రెస్టిజీయస్ మూవీ ఎమర్జెన్సీ(Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. ఎన్నో వివాదాల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అధికార పార్టీ ప్రాపగాండా(BJP Propaganda Movies) మూవీగా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కొందరూ ఈ సినిమాను యావరేజ్ అంటూ రివ్యూలు ఇస్తుండగా.. మరికొంతమంది మాత్రం ఫ్లాప్ అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక మూవీ ప్రేక్షకుడు ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమా ఎలా ఉంది అని మీడియా ప్రశ్నించగా.. ప్రేక్షకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన అనంతరం నాకు ఎమర్జెన్సీ వచ్చిందని అంబులెన్స్‌కి కాల్ చేసి ఇంటికి వెళదాం అనుకున్నాను. బీజేపీ ఇలాంటి పొలిటికల్ సినిమాలు ఎందుకు తీస్తుందో అర్థం కావాట్లేదు. మోడీ సినిమాని వివేక్ ఒబేరాయ్ తీస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఇందిరా గాంధీ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందిరా లాంటి స్ట్రాంగ్ వుమెన్ పాత్రలో నటించాలి అనుకున్నప్పుడు కొంచెం అయిన వర్క్ చేయాల్సింది. కానీ కంగనా అసలు అలా కనిపించలేదు. ఈ సినిమాలో కంగనా నటించలేదు మిమిక్రీ చేసింది. ఇందిరా గాంధీ పాత్రలో కంటే కంగనా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా బాగా సెట్ అయ్యింది.
అనుపమ్ ఖేర్కి ఈ మధ్య ఏం అయ్యిందో తెలియట్లేదు. ప్రతి బీజేపీ ప్రాపగాండా సినిమాలో నటిస్తున్నాడు. పాత అనుపమ్ ఖేర్ మళ్లీ కనిపించడు ఏమో. శ్రేయాస్ తల్పడే కూడా వాజ్‌పేయ్ పాత్రలో సెట్ అవ్వలేదు. ఏం చెబుతాం అనుకొని ఈ సినిమా తీశారో అర్థం కాదు. బయోగ్రఫీలో మిర్చి మసాలా జోడించినట్లు ఉంది అంటూ అభిమాని చెప్పుకోచ్చాడు.
Don’t know about the movie, But this review deserves ⭐️⭐️⭐️⭐️💫
4.5/5 stars. 😄 #EmergencyReview pic.twitter.com/oYou1fEXBu— Mohammed Zubair (@zoo_bear) January 17, 2025
#EmergencyReview – A Disastrous Attempt at Storytelling! #EmergencyRating – ⭐#EmergencyMovie is an underwhelming and poorly executed attempt at capturing a significant chapter in #Indian history. The larger-than-life persona of #IndiraGandhi is reduced to a shallow and… pic.twitter.com/iA4iXQCYVL
— Indian Box Office (@TradeBOC) January 17, 2025
#EmergencyReview – ⭐🌟
EMERGENCY is a mess of massive proportions. The movie neither does justice to the larger-than-life persona of #IndiraGandhi, nor does it entertain or engage.
The crux of the narrative – the period of #Emergency – is presented in an utterly half-baked… pic.twitter.com/c3AQSXrkCu
— Box Office Chronicle (@BoxOffice_Truth) January 17, 2025