Ekta Kapoor | జస్టిస్ హేమ మిటీ నివేదికతో మాలీవుడ్ ఉలిక్కిపడింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు, దోపిడీని బట్టబయలు చేసింది. అయితే, కమిటీ నివేదికపై పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా నిర్మాత, దర్శకురాలు ఏక్తా కపూర్ సైతం కమిటీ నివేదికపై స్పందించారు. మహిళలకు సమాన అవకాశాలు, కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న సమయంలోనే మహిళలు కార్యాలయాల్లో తాము సురక్షితమని భావిస్తారన్నారు. ఏక్తా ప్రొడక్షన్లో ‘ది బకింగ్హోమ్ మర్డర్స్’ మూవీ తెరకెక్కించారు. మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించేందుకు అవసరమైన ప్రయత్నాలు ఉండాలన్నారు. చాలాచోట్ల, అగ్రస్థానాల్లో, కంపెనీలను నడిపే మహిళలు కావాలన్నారు. తద్వారా మహిళలు ఏకమవుతారన్నారు.
వర్క్ ప్లేస్ సహా ఎక్కడైనా మహిళలకు సురక్షితమైన వాతావరణం కొనసాగించేందుకు ప్రయత్నాలు చేయాలని.. వృత్తిపరమైన ఉద్యోగాల్లో మహిళలు ముందుండాలని.. ఇది జరగాలని తాను భావిస్తున్నానన్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో కేరళ చిత్ర పరిశ్రమ వివాదంలో చిక్కుకున్నది. నివేదిక అనంతరం దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖ్, ముఖేశ్ సహా మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలపై బెంగాలీ నటి సహా పలువురు నటీనటులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో కేసులు సైతం నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఏక్తా కపూర్ దర్శకత్వంలో ‘ది బకింగ్హోమ్ మర్డర్స్’ తెరకెక్కిన ఈ మూవీ.. ఈ నెల 13న థియేటర్లలో విడుదల కానుంది. రణ్వీర్ బ్రార్, యాష్ టాండన్, అసద్ రాజా, ప్రబ్లీన్ సంధు, సంజీవ్ మెహ్రా, అద్వోవా అకోటో, జైన్ హుస్సేన్ కూడా నటించారు.