‘ఎఫ్3’లో రెట్టింపు వినోదం: తమ్మిరాజు
‘ఎఫ్3’ చిత్రంలో ‘ఎఫ్2’ను మించిన వినోదం ఉంటుందని చెబుతున్నారు ఎడిటర్ తమ్మిరాజు. ఈ సిరీస్‌లో సినిమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎడిటర్ తమ్మిరాజు మాట్లాడుతూ…నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లవుతున్నది. దాదాపు 30 చిత్రాలకు ఎడిటింగ్ చేశాను. ‘పటాస్’, ‘బాహుబలి 2, ‘ఎఫ్2’ లాంటి సినిమాలు అందులో ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో పటాస్ చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ‘ఎఫ్2’కు ఎడిటింగ్ బాధ్యతలు వహించాను. గత సినిమా చేసిన అనుభవంతో చెబుతున్నా…‘ఎఫ్3’లో మొదటి సినిమాకు రెట్టింపు వినోదాన్ని చూస్తారు.
డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఈ చిత్రంలో హాస్యభరితంగా తెరకెక్కించారు. ‘ఎఫ్2’లోని పాత్రలను తీసుకుని కొత్త కథతో దర్శకుడు అనిల్ ఈ సినిమాను రూపొందించారు. ఆ కథ ముగిసిన చోటు నుంచి ఈ కథ మొదలవదు. మంచి రచనతో పాటు సరైన ఎడిటింగ్ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. క్రిస్ప్ రన్ టైమ్‌తో ఈ సినిమా ఉంటుంది. కథ వింటే ఏం తెరకెక్కిస్తారో తెలుస్తుంది కాబట్టి కథ వినను, మొత్తం సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదే చూస్తాను. అప్పుడు కొత్త కోణంలో సినిమాను చూడగలుగుతాను. నిర్మాత దిల్ రాజుకు సినిమా పట్ల మంచి అభిరుచి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, చిరంజీవి, బాబీ సినిమా, నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారీ’ చిత్రాలకు ఎడిటింగ్ చేస్తున్నాను అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

