Eagle | మాస్ మహారాజారవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఈగల్ (Eagle). సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈగల్ మూవీలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అందిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ముందుగా పెట్టిన సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఏంటో తెలియజేశారు. ఈగల్ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్ పట్టుకున్న రవితేజ స్టిల్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటం ఖాయమని చెప్పకనే చెబుతోంది. ఇక విధ్వంసం అంటే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచి చూపించాలని గట్టిగానే ఫిక్సయినట్టు అర్థమవుతోంది. మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈగల్లో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Davzand సంగీతం అందిస్తున్నారు.
రవితేజ మరోవైపు పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో నుపుర్ సనన్ హీరోయిన్గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈగల్ విడుదల తేదీ ఫిక్స్..
మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు 🤩
The Man, The Myth, The Massacre 💥#EAGLE 🦅 is arriving on 𝐉𝐀𝐍 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟒.🤘🏻#EAGLEonJan13th @RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@pnavdeep26 @VinayRai1809@davzandrockz… pic.twitter.com/8k0Vgq95Na
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
అతనొస్తున్నాడు !! 🔥#EAGLE 🦅 has locked it’s course of destruction 🤘🏻
Massive upDATE LOADing Today at 4:05 PM 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@davzandrockz @manibkaranam @sujithkolli @srinu10477@UrsVamsiShekar pic.twitter.com/kC9lDPROPL
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023