DVV Danayya | పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. తొలిరోజే రూ.154 కోట్లు కలెక్ట్ చేసి, 2025లో హయ్యెస్ట్ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన ఈ చిత్రం, మొత్తం రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలోనే హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ సీక్వెల్ త్వరలోనే రానుందని చర్చలు నడుస్తున్నాయి.. దర్శకుడు సుజిత్ కూడా కొన్ని సార్లు ఈ విషయంపై హింట్ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కొన్ని ప్రసంగాల్లో సుజిత్ తనకు ఓ ప్రత్యేక పాయింట్ చెప్పినట్టు ప్రస్తావించడంతో సీక్వెల్ గురించి ఊహాగానాలు మరింత పెరిగాయి.
అయితే, ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ గురించి గమనిస్తే, మొదటి భాగాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య వద్దనే హక్కులు ఉన్నాయి. ఆయన ‘నో అబ్జెక్షన్ లెటర్’ ఇస్తే తప్ప వేరే వారు ఈ చిత్రాన్ని నిర్మించలేరు. ఇదే సమయంలో సుజిత్–నాని కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసిన దానయ్య, చివరికి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం. బడ్జెట్ లెక్కలు, ఆర్థిక కారణాలు దీనికి ప్రధాన కారణమని టాక్ నడుస్తుంది. ఓజీ చిత్రానికి కలెక్షన్లు భారీగానే వచ్చాయని చెబుతున్నా కూడా, చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తోంది. ఈ కారణంతోనే దానయ్య ప్రస్తుతం నిర్మాణం నుండి కొంత విరామం తీసుకోవాలని అనుకున్నారని ఓ టాక్ నడుస్తుంది. మరోవైపు దానయ్య తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే ఆలోచన చేస్తున్నట్టు టాక్.
మరోవైపు పవన్ కళ్యాణ్ తాను కమిటైన సినిమాలు పూర్తిచేసి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇక భవిష్యత్తులో సినిమాలు తక్కువగా చేయడం, రాజకీయాలపై మరింత దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీని బలపరిచేందుకు 2029 ఎన్నికల కోసం ముందస్తు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రామ్ తాళ్లూరి, దర్శకుడు సురేంద్ర రెడ్డి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ పదవి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని అంచనా. అయితే, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో సరైన క్లారిటీ లేదు. ఎన్నికల ముందే మరో సినిమా చేస్తారో అనేది స్పష్టత లేదు. దిల్ రాజు నిర్మాణంలో పవన్ మరో సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తున్నా, ఆ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు.