Dulquer Salman | దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘కాంత’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని, రానా, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు లభిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ల్లో బిజీగా ఉన్న దుల్కర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తనపై వస్తున్న విమర్శలపై ఓపెన్‌గా స్పందించారు. నాపై చాలా కాలంగా నటన గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ‘ఇతనికి నటన రాదు’ అని అంటుంటారు. కొన్నిసార్లు నిజంగానే నేను బాగా నటిస్తున్నానా అని చెక్ చేసుకుంటాను.
అప్పుడు భయమేస్తుంది. కానీ వాటిని పాజిటివ్‌గా తీసుకుని ఇంకా కష్టపడతాను. ‘ఈ పాత్ర దుల్కర్ తప్ప ఇంకెవరు చేయలేరు’ అనిపించేలా పెర్ఫార్మెన్స్ ఇస్తాననే లక్ష్యంతో ముందుకు సాగుతాను” అని దుల్కర్ అన్నారు.ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇక ‘కాంత’ తర్వాత దుల్కర్ చేస్తున్న తదుపరి తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరగుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దుల్కర్ లుక్కు భారీ క్రేజ్ రావడంతో, సినిమా కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
‘కాంత’ మంచి టాక్‌తో ముందుకెళ్తుండగా, దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అయితే కాంత చిత్రంలో నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. అయితే ఈ పిరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. సెకండాఫ్ బోరింగ్ కలిగిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పూర్తి మిస్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా ఇందులో కనిపించవు. సెకండాఫ్ అత్యంత పేలవంగా, సహనానికి పరీక్షగా సాగుతుంది. దుల్కర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది.