మలయాళ అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకుడు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
దక్షిణ భారతదేశంలో 100కుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ అల్ట్రా ైస్టెలిష్ అండ్ మాస్ అవతరాల్లో కనిపిస్తారని, ఆయన పాత్రలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు తెలిపారు. దుల్కర్ సల్మాన్ 40వ చిత్రమిదని, ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: నహాస్ హిదాయత్.