వెండికి బదులు రాతెండి!
హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ సిల్వర్‌ఫాయిల్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.
- నకిలీ సిల్వర్ ఫాయిల్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
- పెద్ద ఎత్తున అల్యూమినియం ఫ్లేక్స్, ఇతర సామగ్రి స్వాధీనం
- అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ సిల్వర్‌ఫాయిల్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కేసువివరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ వెల్లడించారు. సాధారణంగా స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ను ఆకర్షణీయంగా అలంకరించేందుకు స్వచ్ఛమైన వెండితో తయారుచేసిన సిల్వర్ వర్క్ రేపర్స్ ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించవు. అయితే వెండి ధరలు భారీగా పెరుగడంతో కొందరు అక్రమార్కులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అల్యూమినియం రేకులను అచ్చం వెండి రేపర్స్లాగా మార్చి విక్రయించడం ప్రారంభించారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ సిల్వర్ రేపర్స్ తయారవుతున్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేశారని కమిషనర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి అల్యూమినియంను దిగుమతి చేసుకుంటున్నారని, వాటిని సిల్వర్ ఫాయిల్లా తయా రుచేసి తెలంగాణ అంతటా స్వీటు షాపులు, బేకరీలు, పాన్‌షాపులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. చార్మినార్‌లోని ఇత్తెహాద్ వర్క్‌షాప్, హుస్సేని ఆలంలోని యూటీసీ సిల్వర్ లీఫ్, మొఘల్‌పురాలోని ఎంఏ మెట్లో వర్క్‌షాపు, ఫలక్‌నుమాలోని తారా యూనిట్ల యజమానులపై కేసులు నమోదు చేశామని వివరించారు.
ఈ దాడుల్లో కిలో నకిలీ షుగర్ బాల్స్, భారీగా తంబాకు, టాల్కమ్ పౌడర్, పాన్ చట్నీలు జప్తు చేశామని చెప్పారు. నకిలీ సిల్వర్ ఫాయిల్ వినియోగంతో కిడ్నీలపై తీవ్ర ప్రభా వం పడుతుందని, నరాల సంబంధిత సమస్యలు, ఎముకల వ్యాధులు, జీర్ణకోశ సమస్య లు వచ్చే అవకాశం కూడా ఉందని సీపీ వివరించారు. అసలైన వెండి ఫాయిల్‌ను చేతితో సున్నితంగా రుద్దితే పొడిలా విడిపోతుందని, అల్యూమినియం అయితే చిన్న ముద్ద లేదా బాల్లా మారుతుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

