బహుభాషా నటుడు దుల్కర్సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘DQ41’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి నెలకుడితి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఈ సంస్ధ నుంచి వస్తున్న పదవ చిత్రం కావడం విశేషం.
అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. మంచుతో కప్పుకున్న అందమైన ప్రకృతి మధ్య ఈ చిత్రం షూటింగ్ జరిగినట్టు ఫొటోలు చెబుతున్నాయి.
వింటర్ అవుట్ ఫిట్స్ ధరించిన దుల్కర్, పూజా హెగ్డేలు, అందమైన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా కనిపించారు. భిన్నమైన లొకేషన్స్‌లో విభిన్నంగా ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ పానిండియా చిత్రానికి కెమెరా: అనయ్ ఓం గోస్వామి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.