King Of Kotha | దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లాంఛ్ అయ్యే టైం ఫిక్స్
King Of Kotha | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha). ఇప్పటికే కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లోడింగ్.. బ్లాస్టింగ్‌కు రెడీనా..? అంటూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. ట్రైలర్ (King Of Kotha Trailer )తేదీని సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.
King Of Kotha | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha). అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే కింగ్ ఆఫ్ కోట ట్రైలర్ లోడింగ్.. బ్లాస్టింగ్‌కు రెడీనా..? అంటూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు.
ట్రైలర్ తేదీని సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్టు 9న ట్రైలర్ (King Of Kotha Trailer) లాంఛ్ చేస్తున్నామని తెలియజేస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, అనిఖా సురేంద్రన్, ప్రసన్నతోపాటు ఇతర పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన ట్రైలర్ అప్డేట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో మొదలైన టీజర్లో తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కింగ్ ఆఫ్ కోట చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఓనమ్ 2023 కానుకగా విడుదల చేయనున్నారు.
Get set for the #KOKTrailer, landing on 9th August. It’s going to be a blast 🔥#KingOfKotha @dulQuer @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman @ActorGokul @ActorSarann @TheVinothCj @SonyMusicSouth @sonymusicindia pic.twitter.com/9glB7FbOQt
— Ramesh Bala (@rameshlaus) August 7, 2023
కింగ్ ఆఫ్ కోట టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

