King Of Kotha | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించిన యాక్టర్లలో ఒకడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఒకడు. ఈ క్రేజీ హీరో ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ మాస్ లుక్‌లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవడమే కాదు.. మరికొన్ని గంటల్లో రాబోయే టీజర్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టీజర్ లాంఛ్ కానుంది.
ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తెలుగు టీజర్ (King Of Kotha teaser)ను లాంఛ్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
కింగ్ ఆఫ్ కోటలో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2023 ఓనమ్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు టాక్. దుల్కర్ సల్మాన్ మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ గన్స్ అండ్ గులాబ్స్లో కూడా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
.@dulQuer’s most awaited #KingOfKotha Teaser is dropping at 6 pm tomorrow! Prepare to be blown away 😉🔥#KOK @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman @ActorGokul @ActorSarann @TheVinothCj @ZeeStudios_ @DQsWayfarerFilm @SonyMusicSouth pic.twitter.com/gSsoDsALdL
— Wayfarer Films (@DQsWayfarerFilm) June 27, 2023
The King arrives in 3 hours 😎🔥
Stay tuned to – https://t.co/c5D0e5uBsP#KingOfKotha @dulQuer @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman @ActorGokul @ActorSarann @TheVinothCj @zeestudiossouth @DQsWayfarerFilm @SonyMusicSouth… pic.twitter.com/pKMVxy6om2
— Zee Studios South (@zeestudiossouth) June 28, 2023