Dulquer Salmaan Kaantha | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘కాంత’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా దుల్కర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. మహనటి సినిమా తర్వాత మళ్లీ అలాంటి పవర్‌పుల్ రోల్లో దుల్కర్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
I got to play a timeless role in a timeless story ⏳✨
I couldn’t ask for a bigger gift to celebrate my 13 years in the industry. Grateful to the entire team of #Kaantha and to the wonderful audiences who have given me all the love and encouragement any actor would dream of !… pic.twitter.com/gy59OdMpb8
— Dulquer Salmaan (@dulQuer) February 3, 2025