Aakasam Lo Oka Tara | తెలుగుతోపాటు సౌతిండియాలో మంచి గుర్తింపు ఉన్న మాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ క్రేజీ యాక్టర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టగా.. వీటిలో పవన్ సాదినేని డైరెక్షన్లో నటిస్తోన్న ఆకాశంలో ఒక తార (Aakasam Lo Oka Tara) కూడా ఒకటి. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది
ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం కొత్త విషయం షేర్ చేశాడు డైరెక్టర్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని. సినిమా చాలా అందంగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రోనాట్ అవ్వాలని కలలు కనే యువతి భావోద్వేగ పూరిత ప్రయాణం, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, స్పూర్తివంతమైన థీమ్ సినిమాకు మెయిన్ హైలెట్గా నిలువబోతున్నాయని కూడా హింట్ ఇచ్చేశాడు.
ఈ మూవీతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా డెబ్యూ ఇస్తోండగా.. శృతిహాసన్ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
యూనిక్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చే దుల్కర్ సల్మాన్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే.. మరోవైపు నవంబర్ 20న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.