బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి గురువారం (సెప్టెంబర్ 5) నుంచి తెరలేవబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లలో చాలామంది ఈ టోర్నీలో పాల్గొననుండటంతో క్రికెట్ అభిమానుల చూపు దులీప్ ట్రోఫీపై పడనుంది. నాలుగు జట్లు (ఇండియా ఏ, బీ, సీ, డీ) తలపడబోయే ఈ ట్రోఫీకి బెంగళూరు (కర్నాటక), అనంతపురం (ఆంధ్రప్రదేశ్) ఆతిథ్యమివ్వనున్నాయి.