Pushpa 2 Songs | స్పీడుమీదున్న డీఎస్పీ..అప్పుడే 3 పాటలు కంప్లీట్..!
సుకుమార్(Sukumar)-డీఎస్పీ (DSP)-అల్లు అర్జున్..ఈ క్రేజీ కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి ఆల్ టైమ్ సూపర్ హిట్ ఆల్బమ్స్ బయటకు వచ్చాయి. ఇక రీసెంట్గా పుష్ప..ది రైజ్ (Pushpa)తో అదిరిపోయే ట్యూన్స్ అందించి..మ్యూజిక్ లవర్స్ కు నిద్రపట్టకుండా చేశాడు దేవీ శ్రీప్రసాద్.
సుకుమార్(Sukumar)-డీఎస్పీ (DSP)-అల్లు అర్జున్..ఈ క్రేజీ కాంబినేషన్ వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ రెడీగా ఉన్నట్టే. ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి ఆల్ టైమ్ సూపర్ హిట్ ఆల్బమ్స్ బయటకు వచ్చాయి. ఇక రీసెంట్గా పుష్ప..ది రైజ్ (Pushpa)తో అదిరిపోయే ట్యూన్స్ అందించి..మ్యూజిక్ లవర్స్ కు నిద్రపట్టకుండా చేశాడు దేవీ శ్రీప్రసాద్. పుష్పలో ఒక్కో పాట ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచేలా కంపోజ్ చేసి అదరహో అనిపించాడు డీఎస్పీ.
కాగా ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఫుల్ స్పీడుమీదున్నట్టు తాజా అప్ డేట్‌తో తెలిసిపోతుంది. ఇంతకీ అసలు విషయమేంటంటే పుష్ప సీక్వెల్ పుష్ప..ది రూల్ (Pushpa 2)రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశాడట. డీఎస్పీ కొన్ని పాటలను గతంలోనే సిద్దం చేశాడట. అయితే సుకుమార్ ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాలని ఫిక్సవడంతో, మధ్యలో వాటిని ఆపేయగా..ఫస్ట్ పార్టు కోసమే పాటలు రెడీ చేశాడట డీఎస్పీ.
ఇపుడు మధ్యలో రెడీ చేసి ఆపేసిన పాటలకు మళ్లీ కొంత టైం కేటాయించి..రెండో పార్టుకు సరిపోయేలా కంపోజ్ చేసినట్టు తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం పుష్ప 2 కోసం మూడు పాటలు సిద్దమయ్యాయి. అయితే సుకుమార్ సినిమా అంటే ఓ స్పెషల్ సాంగ్ లేదా ఐటెం సాంగ్ (Kollywood) కానీ ఉండాల్సిందే. ఈ మూడు పాటల్లో ఒకటి ఐటైం సాంగ్ అట.
Read Also : Beast Movie Ban | ఒక్క సీన్ ఎఫెక్ట్..కువైట్‌లో ‘బీస్ట్’ పై నిషేధం..!
పుష్పలో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ సమంతతో హాట్ హాట్ స్టెప్పులేయించిన సుకుమార్..మరి రెండో పార్టులో ఎవరితో ఆ పాట చేయిస్తాడోనని తెగ చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers banner), ముత్తంశెట్టి మీడియాతో అసోసియేట్ అవుతూ నిర్మించిన పుష్పలో అల్లు అర్జున్ (Allu Arjun)ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్‌గా కనిపించాడు.
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

