Drishyam 3 | మోహన్ లాల్ (Mohan Lal), జీతూ జోసెఫ్ (Jeethu Joseph) కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం (Drishyam) మూవీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దృశ్యం 1, 2 పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ మూవీలోని ట్విస్టులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలను టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) తెలుగులో రీమేక్ చేసి హిట్టందుకున్నాడు. అయితే ఇప్పుడా ఆ మూవీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దృశ్యం 3 ఉండబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ను పంచుకున్నాడు మోహన్ లాల్. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో మొదలుకాబోతున్నట్లు ప్రకటించాడు. గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు అంటూ ఒక వీడియోను పంచుకున్నాడు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ (Aashirvad Cinemas) పై ఆంటోని పెరుంబవూరు (Antony Perumbavoor) ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
October 2025 — the camera turns back to Georgekutty.
The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO
— Mohanlal (@Mohanlal) June 21, 2025