Ram Charan’s Manager’s Son | టాలీవుడ్ నుంచి హీరోల వారసులే కాకుండా, వారి వెన్నంటి ఉండే సన్నిహితుల కుటుంబాల నుంచి కూడా కొత్త టాలెంట్ వస్తుంటుంది. తాజాగా రామ్ చరణ్ డేట్స్, ఇతర సినిమా వ్యవహారాలను దశాబ్ద కాలంగా చూసుకుంటున్న ఆయన మేనేజర్ ప్రవీణ్ కుమారుడు దృషిక్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. దృషిక్ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో లండన్‌లోని ఒక ప్రముఖ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ అయిన ‘మ్యాడ్’ (MAD) ఫ్రాంచైజీలో రాబోతున్న ‘మ్యాడ్ 3’ చిత్రంలో దృషిక్ ఒక హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో దృషిక్కి అవకాశం రావడం విశేషం. రామ్ చరణ్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ కుమారుడు కావడంతో, ఈ కుర్రాడికి మెగా ఫ్యామిలీ మద్దతు కూడా ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నటనతో పాటు డ్యాన్స్, ఫిట్‌నెస్‌లో కూడా దృషిక్ ఇప్పటికే మంచి పట్టు సాధించినట్లు సమాచారం.