టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఐశ్వర్యా రాజేశ్ క్యాబ్ డ్రైవర్ జమున పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ (Driver Jamuna Trailer)ను విడుదల చేశారు.
కడప గ్యాంగ్ క్రిమినల్స్ జమున క్యాబ్ బుక్ చేసుకుంటారు. రోడ్ ట్రిప్‌లో ఉన్న జమున క్రిమినల్స్ ను తీసుకెళ్తుండగా.. నక్కపల్లి టు రుషికొండ వెళ్లే మార్గంలో ఎలాంటి ఘటనలు జరిగాయనే స్టోరీతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు డైరెక్టర్. 90 నిమిషాలపాటు కొనసాగే రైడ్‌లో ఎలాంటి ట్విస్టులు, కీలక మలుపులు కొనసాగనున్నాయనేది సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్.
అవుట్ అండ్ అవుట్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీ కిన్స్లిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డ్రైవర్ జమున తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది చిత్రం. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.