Drishyam-3 Confirmed | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. ఇలా ఉత్తరాది నుండి దక్షిణాది వరకు ఎన్నో సినిమాలు సీక్వెల్‌గా తెరకెక్కాయి. అయితే చాలా వరకు సీక్వెల్‌గా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక, బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. కాగా కొన్ని సీక్వెల్స్ మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో దృశ్యం సినిమా ఒకటి. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. ఇక దీనికి కొనసాగింపుగా గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన దృశ్యం-2 అనూహ్యం విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయగా.. ఇక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి.
తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం ముస్తాబవుతుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా ‘దృశ్యం 3’ రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రొడ్యూసర్ ఆంటోని పెరంబవూర్ ఓ అవార్డు ఫంక్షన్లో అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ‘దృశ్యం 3: ది కంక్లూజన్’ పేరుతో తెరకెక్కనుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూడో చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేష్‌తో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను మొదలు పెట్టనుంది.
#Drishyam3 CONFIRMED by Producer Antony Perumbavoor in the Mazhavil Entertainment Awards.#Mohanlal
— Manobala Vijayabalan (@ManobalaV) August 27, 2022