Drinker Sai | ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా నచ్చితే పదిమందికి చెప్పండని, నచ్చకపోతే వందమందికి చెప్పండని, కథలో హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయని, ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు హార్ట్‌టచింగ్‌గా అనిపిస్తుందని దర్శకుడు తెలిపారు.
తాను ప్రభాస్‌కు పెద్ద అభిమానినని, ఇటీవల ఆయన్ని కలిసినప్పుడు సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుతూ, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడం సంతోషాన్నిచ్చిందని హీరో ధర్మ అన్నారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, శ్రీవసంత్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్‌కు మంచి పేరొచ్చిందని నిర్మాతల్లో ఒకరైన ఇస్మాయిల్షేక్ పేర్కొన్నారు.
కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని సంగీత దర్శకుడు శ్రీవసంత్ తెలిపారు. ఈ చిత్రానికి బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్షేక్, లహరిధర్ నిర్మాతలు.