Jr NTR | టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుసగా భారీ ప్రాజెక్టులతో తన ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న తారక్, తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు శ్రీనివాస్‌తో చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆధ్యాత్మికత, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో కూడిన విభిన్న కథాంశంతో తెరకెక్కనుంది. ముఖ్యంగా కుమారస్వామి నేపథ్యం ఉండబోతుందని, విజువల్ వండర్‌గా మలచడానికి త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం టైటిల్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్‌ను బట్టి చూస్తే, ఈసారి ఎన్టీఆర్‌ను మరింత ఉగ్రరూపంలో, శక్తివంతమైన పాత్రలో చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ రావొచ్చని ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకే రోజు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటనతో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ నుంచి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందట.
ఈ డబుల్ అనౌన్స్మెంట్స్ ఎన్టీఆర్ అభిమానులకు నిజమైన పండుగలా మారనుండడం ఖాయం. ఒకవైపు భారీ యాక్షన్ డ్రామా, మరోవైపు ఆధ్యాత్మిక బ్యాక్‌డ్రాప్‌లో విజువల్ గ్రాండియర్ ఇలా రెండు విభిన్న జానర్లలో సినిమాలు చేయడం ద్వారా తారక్ తన గ్లోబల్ ఇమేజ్ను మరింత బలోపేతం చేస్తున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ తన కెరీర్లో అత్యంత కీలక దశలో ఉన్నాడని చెప్పాలి. వరుసగా భారీ ప్రాజెక్టులు, స్టార్ డైరెక్టర్లతో కాంబినేషన్లు, విభిన్న కథలు అన్నీ కలిసి టాలీవుడ్లో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో చూడాలి.