రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్‌ను పూర్తి చేశారు హీరో రామ్. బుధవారం డబ్బింగ్ సెషన్ నుంచి వీడియోతో పాటు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో రామ్ డబుల్ మాస్ అవతారంలో కనిపిస్తారని, ఓల్డ్‌సిటీ శంకర్‌గా ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సినిమా విజయంపై పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నామని మేకర్స్ తెలిపారు. కావ్యథాపర్, సంజయ్‌దత్, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్.