Elimination | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను ఊహించని ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా సరికొత్త డ్రామా, ఎమోషన్స్, గొడవలతో సాగుతోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఎంటర్టైన్మెంట్ మరింత పెరిగింది. అయితే అదే సమయంలో హౌస్‌లో వాదనలు, గొడవలు కూడా ఎక్కువయ్యాయి. అయినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం ఈ సీజన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతని గేమ్ గ్రాఫ్ మరింత ఎత్తుకు చేరిందని చెప్పాలి. హౌస్‌లో ఇప్పుడు అతనిపై అంచనాలు పెరిగాయి.
ఈ వారం మధ్యలో అయేషా ఆరోగ్య సమస్యల కారణంగా హౌస్‌ను విడిచి వెళ్లింది. ఆమెకు టైఫాయిడ్ రావడంతో బిగ్ బాస్ వైద్యుల సలహా మేరకు ఇంటికి పంపించారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ప్రేక్షకులు భావించారు. అయితే, బిగ్ బాస్ అనూహ్యంగా మరో షాక్ ఇచ్చాడు. వీకెండ్ ఎపిసోడ్లో రెండో ఎలిమినేషన్ కూడా జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈసారి రమ్య మోక్ష హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. షూట్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. గత వారం రమ్య వెళ్లిపోతుందనే ఊహాగానాలు వచ్చినా, చివరికి భరణి శంకర్ అవుట్ అయ్యాడు.
బిగ్ బాస్ హౌస్‌లో రెండు వారాలు మాత్రమే ఉన్న రమ్య మోక్షకు సుమారు రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన నేపథ్యంలో, ఎవరైనా రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, దమ్ము శ్రీజను మళ్లీ ఇంట్లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోందట. వచ్చే వారం మిడ్ వీక్‌లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి, ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ మరింత వైలెంట్‌గా, డ్రామాటిక్‌గా మారబోతోందని టాక్ వినిపిస్తోంది. అభిమానులు ఇప్పుడు దమ్ము శ్రీజ రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.