AK62 | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన అజిత్ సరిగ్గా 30ఏళ్ల క్రితం అమరావతి సినిమాతో హీరోగా తొలి సినిమా చేశాడు. ఇక అదే ఏడాది ప్రేమ పుస్తకంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అజిత్ అంతగా తెలుగు మార్కెట్‌పై మక్కువ చూపలేదు. దాంతో ఆయన సినిమాలు రెండు కోట్లకు మించి కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది భారీ స్థాయిలో రిలీజైన తెగింపు సైతం కోటిన్నర కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే సోమవారం అజిత్ బర్త్‌డే సందర్భంగా తన తదుపరి సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది.
అజిత్ తన తదుపరి సినిమాను మగిజ్ తిరుమేనితో చేస్తున్నాడు. తడం, కలగ తలైవాన్ వంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించిన మగిజ్.. అజిత్‌తో నెక్స్ట్‌సినిమా చేస్తుండటంతో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. కాగా సోమవారం అజిత్ బర్త్‌డే సందర్భంగా ఏకే62 మూవీ టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే అజిత్ అభిమానులకు సోమవారం డబుల్ ధమకానే. గత కొంత కాలంగా అజిత్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతున్నాడు.