Tharun Bhascker – Superman Movie | హాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్‌మ్యాన్ (Superman) సినిమాలోని పలు సన్నివేశాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కత్తిరించడంపై పలువురు సినీ ప్రముఖులు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన 33 సెకండ్ల ముద్దు సన్నివేశాన్ని ఇండియన్ వెర్షన్లో కట్ చేయించింది సెన్సార్ బోర్డు.
దీంతో ఈ విషయంపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్‌మ్యాన్ సినిమాలో ముద్దు సన్నివేశం తొలగించారని తెలిసింది. ఏం దిక్కుమాలిన చర్య ఇది. మనల్ని థియేటర్‌కి రమ్మన్ని పైరసీని ఎంకరేజ్ చేయవద్దని సెన్సార్ వాళ్లు కోరతారు. కానీ వాళ్లేమే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. థియేటర్‌కు వెళ్ళే అనుభవాన్ని ఎందుకు ఇంత దారుణంగా మారుస్తారు? మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్ని నిర్ణయించుకోనివ్వండి. మా సమయంతో, మా డబ్బుతో ఏం చేయాలో మమ్మల్ని డిసైడ్ అవుతాము అంటూ శ్రేయా రాసుకోచ్చింది.
అయితే ఈ విషయంపై తాజాగా తన వంతు గొంతు కలిపాడు టాలీవుడ్ దర్శకుడు తరుణ్‌భాస్కర్. సెన్సార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తరుణ్ స్పందిస్తూ.. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, ‘విలువలు’ నేర్పించాలనే పేరుతో సినిమాలను సెన్సార్ చేయడం కాలం చెల్లిన పద్ధతిగా, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇది కళను నియంత్రించడానికి, నైతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేసే ఒక తప్పుడు ప్రయత్నం. సమాజానికి కథల నుంచి రక్షణ కావాలన్నట్లుగా ఉంది. ఇది సంస్కృతిని కాపాడడం కాదు. వ్యక్తిగత అహంభావాలను పెంచి పోషించడమే. ఇది నిజంగా బాధాకరం అంటూ తరుణ్ రాసుకోచ్చాడు.
Super Man Movie