Mammootty – Gautham Vasudev Menon | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు (Dominic and The Ladies’ purse). తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మమ్ముట్టి సొంత ప్రోడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి ట్రైలర్‌ను వదిలారు మేకర్స్.
ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. మమ్ముట్టి ఇందులో డొమినిక్ అనే డిటెక్ట్వ్ పాత్రలో నటించబోతున్నాడు. ఆసుపత్రిలో దొరికిన లేడీస్ పర్సు(Wallet)కి సంబంధించి ఈ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తప్పిపోయిన ఆ లేడీస్ పర్స్ ఎవరిది అని డొమినిక్ కనిపెట్టాడా.. ఇంతకీ ఆ పర్స్‌లో ఏముంది.. ఈ పర్స్‌కి మర్డర్స్‌కి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. డా.నీరజ్ రాజన్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా.. గోకుల్ సురేష్ , సుస్మితా భట్ , విజి వెంకటేష్ , వినీత్ , విజయ్ బాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు.