ఇక్కడ కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లే ఉంది కదా.. మీరు ఊహించిన పేరు కరెక్టే. ఆమెవరో కాదు.. అమలా పాల్ ( Amala paul ). తాజాగా తన సోషల్ మీడియా పేజీలో ఇలా కొత్తగా దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అందులో తమిళ హీరోయిన్ అమలా పాల్ కూడా ఉంటుంది.
నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది అమలా పాల్. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘నాయక్’, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, నానితో ‘జెండా పై కపిరాజు’ లాంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి ఊపు మీదున్న టైమ్‌లోనే తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. ఆయన దర్శకత్వంలో రెండు మూడు సినిమాలు చేసింది ఈ భామ. అప్పుడే ప్రేమించుకున్నారు.. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే అతనితో ఎక్కువ కాలం కలిసి జీవించలేదు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అమలతో విడిపోయిన తర్వాత విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అమల మాత్రం అలాగే ఒంటరిగా మిగిలిపోయింది.
ఈ మధ్యే తాను కూడా ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్టు తెలిపి అందరికీ చెప్పి షాకిచ్చింది. ఈ మధ్యే నెట్ ప్లిక్స్ ఒరిజినల్‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పుకుంది అమలా పాల్. ఏ.ఎల్ విజయ్‌తో విడిపోవాలనుకున్న సమయంలో తనను చాలా మంది భయపెట్టారు.. జీవితమే ఉండదని చెప్పారు కానీ ఆ తర్వాత అందరికీ తానేంటో అర్థమైపోయిందని చెప్పింది అమల. చాలా మంది తనను అర్ధం చేసుకోకపోగా.. నువ్వొక అమ్మాయివి.. నీ కెరీర్ పాడైపోతుంది అంటూ బెదిరించారని చెప్పింది. ఆ సమయంలో ఒక్కరు కూడా తనను సపోర్ట్ చేయలేదని.. అండగా నిలబడలేదని బాధ పడింది. అయితే ఇన్నాళ్లకు తనను అర్థం చేసుకునే వ్యక్తి లైఫ్ లోకి వచ్చాడని.. ఇప్పుడు తాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది అమల. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగానే దూసుకుపోతుంది అమలా పాల్.