Pawan Kalyan Son | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడని తెలిసి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి, హెల్త్ అప్డేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మార్క్ శంకర్‌కి చిన్నపాటి గాయాలు అయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కాస్త అనారోగ్యం పాలయ్యాడని తెలిసింది. సింగపూర్‌లో అగ్నిప్రమాదం తర్వాత మార్క్ శంకర్‌కు ముందు అత్యవసర వార్డులో ఉంచి ఆ తర్వాత సాధారణ గదికి తీసుకొచ్చారు.. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్‌కి డాక్టర్స్ తెలిపినట్టు సమాచారం.
కుమారుడి విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి నేరుగా సింగపూర్ వెళ్లారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి మార్క్‌శంకర్‌ను చూసి అనంతరం వైద్యులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పారట… కాగా మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదని, చిన్నారి క్షేమంగానే ఉన్నాడని పవన్ కళ్యాణ్‌కి, చిరంజీవి వైద్యులు తెలిపినట్టు సమాచారం. తాజాగా సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల కాగా, ఇందులో తాను క్షేమంగా ఉన్నానని సింబాలిక్‌గా చెబుతున్నట్టు అర్ధమవుతుంది. ఈ పిక్ చూసాక అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.జ
ఇక మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు షేర్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా కూడా చిన్నారి విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందామని, త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామంటూ ట్వీట్ చేశారు.