పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చిందో తెలుసా
వకీల్ సాబ్ టీఆర్పీ | పవన్ స్థాయికి ఇది కాస్త తక్కువ రేటింగ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా చూస్తే మాత్రం మంచి టీఆర్పీ తీసుకొచ్చింది వకీల్ సాబ్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఈ సినిమాను చూశారు.

మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వకీల్‌సాబ్. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు థియేటర్లలో విడుదలైన చివరి సినిమా కూడా ఇదే. ఒకవైపు వైరస్ విజృంభిస్తున్నా కూడా మరోవైపు పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాడు. దాదాపు 85 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. దీంతో థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఈ సినిమాను ఇంట్లో కూర్చొని హాయిగా చూసి ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత ఈ మధ్య జీ తెలుగులో తొలిసారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పేరుతో ఈ సినిమాను ప్రసారం చేశారు. దీనికి ప్రమోషన్ కూడా బాగానే చేశారు. సిటీలో పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వకీల్ సాబ్ ప్రీమియర్ గురించి చాలా చర్చ జరిగింది.
ఈ సినిమా కోసం జీ తెలుగు దాదాపు 16 కోట్లకు పైగా వెచ్చించ్చిందని సమాచారం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు యాడ్ రెవిన్యూ కూడా బాగానే వచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే వకీల్ సాబ్ టీఆర్పీ రేటింగ్ ఇప్పుడు బయటికి వచ్చింది. తొలిసారి ఈ సినిమా టీవీలో ఎంత టీఆర్పీ తీసుకొచ్చిందని అభిమానులతో పాటు.. మిగిలిన ఛానల్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. ఈ సినిమాకు 19.12 రేటింగ్ వచ్చింది.

పవన్ స్థాయికి ఇది కాస్త తక్కువ రేటింగ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా చూస్తే మాత్రం మంచి టీఆర్పీ తీసుకొచ్చింది వకీల్ సాబ్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఈ సినిమాను చూశారు. పైగా అమెజాన్‌లో మూడు వారాల్లోనే విడుదలైంది. మిగిలిన డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఒరిజినల్ ప్రింట్ వచ్చేసింది. దాంతో టీవీలో చూడడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయినా కూడా 19కి పైగా రేటింగ్ వచ్చింది. సాధారణంగా పెద్ద హీరోలకు 20కి పైగా రేటింగ్ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. ఏ సినిమాకు అంత టీఆర్పీ రావడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాకు 19 కి పైగా రేటింగ్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ వకీల్ సాబ్ సినిమా మా టీవీ తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా రేటింగ్ 23-25 మధ్య వచ్చి ఉండేదని విశ్లేషకుల అంచనా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

