Pushpa The Rule | టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా పుష్ప.. ది రూల్ షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు ఈ మూవీ 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సుకుమార్ అండ్ టీం ప్రస్తుతం స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులపై దృష్టిపెట్టారని టాక్.
ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా చాలా యాక్షన్ సన్నివేశాలను పుష్ప.. ది రూల్‌లో యాడ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించేందుకు ప్రతీ ఫ్రేమ్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్నారట. పుష్ప.. ది రూల్ షూటింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీఫిలింసిటీలో షురూ అయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్లో అల్లు అర్జున్‌తోపాటు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
పుష్ప ది రూల్ ఫుల్ లెంగ్త్ హై డోస్ ఎలివేషన్‌తో సాగనుండగా.. కథానుగుణంగా ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని టాక్. ఇప్పటికే నడుస్తున్న టాక్ ప్రకారం సీక్వెల్లో అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ మధ్య వచ్చే నాలుగు యాక్షన్ సన్నివేశాలు, జగపతిబాబుతో ఒక యాక్షన్ సీన్ ఉండనుండగా.. యాక్షన్ సీక్వెన్స్‌ను హాలీవుడ్‌కు చెందిన టీం పర్యవేక్షణలో షూట్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఫస్ట్ పార్టును మించిపోయే పాటలను రెడీ చేస్తున్నాడని ఇప్పటికే సుకుమార్ టీం అప్డేట్ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సీక్వెల్లో కూడా శ్రీవల్లిగా మరోసారి సందడి చేయనుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా.
Icon StAAr #AlluArjun‘s #Pushpa part 2 shoot 40% completed till now.
The team is now fine-tuning the script.
Lot of action scenes are added in the #Pushpa2 to live up to audiences’ expectations.
The makers are leaving no stone unturned to make #PushpaTheRule a visual spectacle… pic.twitter.com/SRyLRM8dIY
— Manobala Vijayabalan (@ManobalaV) August 7, 2023
పుష్పరాజ్ ఎక్కడ..?