Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. చాలా రోజుల క్రితం షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఏదో రకంగా ఆలస్యమవుతూనే ఉంది. తాజా అప్డేట్ ప్రకారం ఇంకా 45 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉంది.
ఈ షెడ్యూల్ పూర్తయితే కానీ గేమ్ ఛేంజర్ చిత్రీకరణకు పుల్ స్టాప్ పడదని ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన రాంచరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందేనన్నమాట. గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్లో రాంచరణ్ తండ్రి పాత్రపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఇటీవలే ఓ అప్డేట్ వచ్చిందని తెలిసిందే. ఈ మూవీలో సీనియర్ రాంచరణ్‌కు జోడీగా రాజోలు సుందరి అంజలి కనిపించనుంది.
గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇటీవలే గేమ్ ఛేంజర్ కీలక షెడ్యూల్ పూర్తవగా.. ఈ షెడ్యూల్లో సునీల్, నవీన్ చంద్ర, రాంచరణ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్.