Laddu | గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదం పంచిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మాతగా చేసిన మ్యాడ్ 2 మూవీ మార్చి 28న విడుదల చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన 75 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా అడుగులు వేస్తోంది.నార్నె నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్,విష్ణు లు కీలక పాత్రల్లో నటించిన మ్యాడ్ స్క్వేర్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే మ్యాడ్ స్క్వేర్ చిత్రం లడ్డు గాడి పాత్ర చుట్టే తిరుగుతుంది. లడ్డు గాడి పాత్రలో విష్ణు అనే నటుడు నటించారు.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో లడ్డు పాత్ర బాగుంటుంది. లడ్డు పాత్రలో నటించిన విష్ణు అందరిని పడి పడి నవ్వేలా చేశారు. రెండు సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయింది. అయితే ఇతను ఎప్పట్నుంచో సినిమాల్లో ఉండగా, మ్యాడ్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విష్ణు కూడా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ బ్యాచ్. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిలిం లో నటించి మెప్పించాడు. అంతేకాదండోయ్ విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలో విష్ణు కూడా చదివాడు. విజయ్ కి సబ్ జూనియర్ విష్ణు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ టాక్సీవాలా మూవీ ప్రీ రిలీజ్ చెప్పాడు.
ఇతని పేరు విష్ణు.నా కాలేజీలో సబ్ జూనియర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే మేం కాలేజీ రోజుల్లో ఉన్న సమయంలో విష్ణు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పటికే మంచి టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు.. అందరిని బాగా నవ్విస్తూ ఉండేవాడు. అలా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నేను నేను యాక్టర్ అయ్యాక విష్ణు టాక్సీవాలా సినిమాలో ఒక రోల్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనిపించి అవకాశం ఇచ్చాము.. లైఫ్ లో బాగా సెటిల్ అవుతాడు అని విజయ్ దేవరకొండ అప్పుడే చెప్పుకొచ్చాడు. విజయ్ చెప్పినట్టే విష్ణు ఇప్పుడు అప్రతిహతంగా సినిమాల్లో దూసుకుపోతున్నాడు.
విష్ణు తొలుత షార్ట్ ఫిలిమ్స్‌లో నటించగా, ఆ తర్వాత ట్యాక్సీవాలా సినిమాతో నటుడిగా వెండితెరకి పరిచయం అయ్యాడు. అనంతరం రామన్న యూత్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో.. ఇలా అనేక సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. మ్యాడ్ సినిమాకి గాను లడ్డుకి ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. ఇతను నటుడు మాత్రమే కాదు ఫొటోగ్రాఫర్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విష్ణు తను తీసిన ఫోటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ చదువుతున్నప్పటి నంచి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ తో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు కమెడీయన్‌గా అదరగొడుతున్నాడు..