కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram)త్వరలోనే ‘కోబ్రా’ (Cobra)తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి కీ రోల్స్ పోషిస్తున్నారు. కోబ్రాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
కోబ్రా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కొన్ని కట్స్ అనంతరం సెన్సార్ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్ జారీచేసినట్టు టాక్. ఇక మరోవైపు ఈ సినిమా రన్ టైం న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా అప్ డేట్ ప్రకారం కోబ్రా రన్‌టైం 3 గంటల 3 నిమిషాలు ఉండనుందట.
కోబ్రా చిత్రంలో రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ఎస్ లలిత్ కుమార్సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కోబ్రాతో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నాడు.