800 The Movie | లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. 800 టైటిల్(800 Title)తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ (Madhurr Mittal) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంఛింగ్‌కు సంబంధించిన అప్డేట్ అందించి.. మూవీ అండ్ స్పోర్ట్స్ లవర్స్ ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెప్టెంబర్ 5న ముంబైలో మధ్యాహ్నం 2:45 గంటలకు 800 ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమా సీన్లతో డిజైన్ చేసిన స్పెషల్ వీడియోను శ్రీదేవి మూవీస్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ముత్తయ్య మురళీధరన్ లుక్‌లో మధుర్ మిట్టల్ అచ్చు గుద్దినట్టు కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు . తమిళం, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్నిమూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత, పాపులర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad)దక్కించుకున్నట్టు ఇప్పటికే ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Sachintendulkar
ఈ మూవీలో మహిమ నంబియార్ కీలక పాత్రలో నటించనుండగా.. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. 800 సినిమాను అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉందని తెలిసిందే. ఈ రికార్డు స్ఫూర్తితోనే సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
The GOD of cricket @sachin_rt garu will launch the Trailer of Spin Wizard #MuthiahMuralidaran‘s Biopic #800 on Sep 5th @ 2:45PM, Mumbai 🏏
Trailer Announcement 🏆https://t.co/ksL4puSHKl#800TheMovie #MSSripathy @MaddyMittal #Ghibran @Mahima_Nambiar @RDRajasekar pic.twitter.com/tKj7nxzDxw
— Sridevi Movies (@SrideviMovieOff) September 4, 2023