AnumanaPakshi | ‘డీజే టిల్లు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘అనుమానపక్షి’. ‘ఎ సైక్ ఖాస్టిక్ కామెడీ’ (AnumanaPakshi – A Psych Chaotic Comedy) అనేది ఉపశీర్షిక. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రంలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ (సలీం ఫేకు) వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరవనున్నారు. దర్శకుడు విమల్ కృష్ణ తన మార్క్ కామెడీ నరేషన్తో ఈ కథను ఎంతో క్రేజీగా మలిచినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్లో హీరో ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ అనుమానం పెంచుకుని దానివలన ఎదురైన పరిణామలు ఏంటి అనేది సినిమా కథ అని తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దాండ్, శ్రీచరణ్ మర్నేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, భరత్ లక్ష్మిపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విమల్ కృష్ణ నుండి వస్తున్న సినిమా కావడంతో, జూలై 10న విడుదల కాబోతున్న ‘అనుమానపక్షి’ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి.